జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైైన దివ్య
జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైైన దివ్య
జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైైన దివ్య


చీపురుపల్లి, 15 జూలై (హి.స.)

మండలంలోని పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. దివ్య చరిత జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో నిర్వహించిన 38వ రాష్ట్ర టెన్నికాయిట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించింది. దీంతో విద్యార్థిని అక్టోబర్ 17 నుంచి 21 వరకు పంజాబ్ రాష్ట్రంలో జలంధర్లో ఉన్న డీఏవీ యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. జాతీయ స్థాయిలో కూడా మెరగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, పెదనడిపల్లి ఉన్నత పాఠశాలకుపేరు తేవాలని ప్రధానోపాధ్యాయులు ఎల్.తిరుపతిరావు, వ్యాయామ ఉపాధ్యాలు ఎం.రామారావు, సహచర ఉపాధ్యాయ సిబ్బంది బాలికను అభినందించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande