అంతర్జాతీయస్థాయి విండ్ సర్ఫింగ్ పోటీలకు రాష్ట్రంనుండి తొలిసారిగా ఎంపికైన రష్మిత
అంతర్జాతీయస్థాయి విండ్ సర్ఫింగ్ పోటీలకు రాష్ట్రంనుండి తొలిసారిగా ఎంపికైన రష్మిత
అంతర్జాతీయస్థాయి విండ్ సర్ఫింగ్ పోటీలకు రాష్ట్రంనుండి తొలిసారిగా ఎంపికైన  రష్మిత


పీఎంపాలెం, , 15 జూలై (హి.స.)

: రాష్ట్రం నుంచి తొలిసారిగా ఎంజీ అండ్ జీఏ సెయిలింగ్ క్లబ్కు చెందిన 14 ఏళ్ల తిమిటి రష్మిత అంతర్జాతీయస్థాయి విండ్ సర్ఫింగ్ పోటీలకు ఎంపికైంది. రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన తొలి బాలికగా, చిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. పీఎంపాలెంకు చెందిన రష్మిత ఈ నెల 17 నుంచి 24 వరకు పోలాండ్లోని సోపోట్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక యూరోపియన్ ఛాంపియన్షిప్లో అండర్-17 విభాగంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ప్రపంచస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలతో పాటు ఆగస్టు 4 నుంచి 8 వరకు మలేసియాలో జరగనున్న ఏషియన్ ఛాంపియన్షిప్కు కూడా ఎంపికైంది. యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైఏఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), శిక్షకులు అందించిన ప్రోత్సాహంతో చిన్న వయసులోనే సముద్రంపై అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన రష్మితకు అసోసియేషన్ల ప్రతినిధులు, సెయిలింగ్ క్లబ్ సభ్యులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande