అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి.. షాద్నగర్ ఎమ్మెల్యే
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి.. షాద్నగర్ ఎమ్మెల్యే
Mla


షాద్నగర్, 15 జూలై (హి.స.)

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14 227, వార్డులతోపాటు 228, 231, 234 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల నమోదు, వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అధికారులు, బీఎల్ఎలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, అపోహలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం సూచనలను ప్రజలు అనుసరించాలని సూచించారు.

షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 12వ వార్డులో కౌన్సిలర్ కళ్యాణ్కర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో షాద్నగర్ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొంటూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేసి నాణ్యమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande