
హైదరాబాద్, 15 జూలై (హి.స.)వరంగల్ ఎయిర్పోర్టును 2028 నాటికి పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. ఆ క్రెడిట్ తీసుకునేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘2011లో రైట్స్ కంపెనీ దేశంలో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు సాధ్యాసాధ్యాలపై చేసిన అధ్యయనంలో వరంగల్, కడప పేర్లు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక ఉడాన్ స్కీంతో ఎయిర్ పోర్టుల పెంపునకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 88 ఎయిర్పోర్టులకు ఆమోదం తెలిపింది. అందులో వరంగల్ కూడా ఉంది. భూసేకరణ పూర్తికాకపోవడం వల్లే ఎయిర్ పోర్టు నిర్మాణం ఇంత ఆలస్యమైంది. వరంగల్కు ఎయిర్పోర్టు వస్తోందంటే దానికి కారణం మోదీ. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్టు రాబోతోంది’’అని రామచందర్రావు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్