
తిరుచానూరు, 15 జూలై (హి.స.) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యనిర్వహణ అధికారి సంజీవ్ కుమార్ ప్రసాద్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV