ఎనిమిది నెలల తర్వాత తెరుచుకున్న గ్లోబల్ ఆసుపత్రి
ఎనిమిది నెలల తర్వాత తెరుచుకున్న గ్లోబల్ ఆసుపత్రి
global-multi-speciality-hospital-reopened-following-high-court-orders


మదనపల్లె, 15 జూలై (హి.స.) : మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ రోజు బుధవారం ఉదయం అధికారికంగా తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్ 11న వివిధ కారణాలతో జిల్లా వైద్యశాఖ అధికారులు ఆసుపత్రిని మూసివేయగా, దీనిపై ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

విచారణ అనంతరం ఆసుపత్రిని తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆసుపత్రి యజమాని డాక్టర్ ఆంజనేయులుకు రీ-ఓపెనింగ్ అనుమతి ఉత్తర్వులు అందజేశారు.

బుధవారం అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య, మదనపల్లె రెండో పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, డాక్టర్ ఆంజనేయులు సమక్షంలో అధికారికంగా రీ ఓపెన్ చేసి అనుమతి పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ, న్యాయపోరాటం ఫలితంగా గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు తిరిగి ప్రారంభమైనందుకు సంతోషం వ్యక్తం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande