తిరుమలకు భక్తుల తాకిడి.. శిలాతోరణం వరకూ క్యూలైన్
తిరుమలకు భక్తుల తాకిడి.. శిలాతోరణం వరకూ క్యూలైన్
తిరుమల


తిరుమల, 15 జూలై (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోపాయి. ప్రస్తుతం శిలాతోరణం దాటి క్యూ లైన్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.

ఉదయం 8 గంటల తర్వాతి నుంచి ఎలాంటి టోకెన్ లేకుండా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15-18 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5-7 గంటలు సమయం పడుతుందని వెల్లడించింది.

నిన్న (మంగళవారం) స్వామివారిని 75,485 మంది భక్తులు దర్శించుకోగా.. 30,939 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు సమకూరింది. 3.70 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.99 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande