
కదిరి, 15 జూలై (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని కదిరిలో నిర్వహించారు.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కదిరి డీఎస్పీ జె. శివన్నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేసి, వాటి వినియోగం ద్వారా ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కదిరి, పుట్టపర్తి, హిందూపురం, ధర్మవరం తదితర పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా నడిచే అన్ని ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అమర్చనున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత, రోడ్డు రవాణా వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV