ఈ నెల 22 న తూర్పు గోదావరి జిల్లా. కలెక్టరేట్ లో.జాబ్. మేళా
ఈ నెల 22 న తూర్పు గోదావరి జిల్లా. కలెక్టరేట్ లో.జాబ్. మేళా
ఈ నెల 22 న తూర్పు గోదావరి జిల్లా. కలెక్టరేట్ లో.జాబ్. మేళా


రాజమండ్రి, 16 జూలై (హి.స.)

,:తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈనెల 22వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిప్రకటించారు. ఈ జాబ్మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్లొని యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

మురుగు నీరు గోదావరిలో కలువకుండా 50 ఎంఎల్డీ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. మోరంపూడిలో సర్వీస్ రోడ్లను వేయిస్తామని తెలిపారు. క్రికెట్ స్టేడియం కోసం భూములు సేకరిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande