
అమరావతి, 16 జూలై (హి.స.)
:ఏపీకమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిబ్రెయిన్ స్ట్రోక్కు గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
అయితే, కొన్ని రోజుల క్రితం బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం జరిగిన విషయం తెలిసిందే. వారి వివాహా వేడుకలకు కూడా మంత్రి లోకేశ్ హాజరై ఆశీర్వదించారు.
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేశ్ తెలిపారు. ఆయన సతీమణి గౌతమీ శ్వేతతో ఫోన్లో మాట్లాడి పరామర్శించినట్లు చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ