హైదరాబాదు లిక్కర్ కేసులో కీలక పరిణామం
హైదరాబాదు లిక్కర్ కేసులో కీలక పరిణామం
liqueur


అమరావతి, 16 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇందుకోసం వారిని చంచల్గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించే ఏర్పాట్లు చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపడుతోంది. మద్యం రవాణా టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సవరించడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను, సంబంధిత వ్యక్తులను విచారించిన అధికారులు, ఇప్పుడు కస్టడీలో నిందితులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande