
హైదరాబాద్, 16 జూలై (హి.స.)దిల్లీలో మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పందించారు. కేసీఆర్ పదేళ్ల పాలనను ‘ఫాంహౌస్ పాలన’గా ఆయన అభివర్ణించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోకుండా ఫాంహౌస్కే ఆయన పరిమితమయ్యారని విమర్శించారు.
ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి పలు రంగాల్లో వైఫల్యాలకు కారణమయ్యారని పొంగులేటి ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లి పాలన అందిస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వంతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని పొంగులేటి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్