
హైదరాబాద్, 16 జూలై (హి.స.)తుంగతుర్తిలో నెలకొన్న వివాదాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని కోమటిరెడ్డి నివాసంలో ఆయనతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవుల విషయంలో నెలకొన్న వివాదంపై చర్చించారు.
కోమటిరెడ్డితో భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి అంశంలో కలగజేసుకునేందుకు కోమటిరెడ్డి ఆసక్తి చూపించడం లేదన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కావాలంటే వరుసగా మూడేళ్లు పార్టీ కార్యకర్తగా కొనసాగాలనే ఏఐసీసీ నిబంధన ఉందన్నారు. తుంగతుర్తిలో మూడు, నాలుగు మండలాల్లో ఆ నిబంధనల ప్రకారం నియామకాలు జరగలేదన్నారు. ఈ వ్యవహారంపై ఈనెల 20లోపు నివేదిక ఇస్తానని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్