వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తాం: మంత్రి తుమ్మల
వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
Thummala


హైదరాబాద్, 16 జూలై (హి.స.)వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎల్నినోపై రాష్ట్ర తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్లాన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈరోజు సచివాలయంలో ఈ ప్రణాళికను విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఆయా మండలాలు, జిల్లాల వారీగా వర్షపాతం లోటు వివరాలు అందజేయాలని అధికారులకు సూచించారు.

రెండు నెలల వాతావరణ అంచనాల ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. ఐఎండీ సమాచారంతో రోజువారీ వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. రైతులకు పంటల ఎంపిక, నీటి వినియోగంపై శాస్త్రీయ సూచనలు అందజేస్తామని చెప్పారు. ఆయా పంట నష్టాల నివారణకు అన్ని శాఖల సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ఎల్నినో ప్రభావంపై ముందస్తు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande