తిరుమల వెంకన్నను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ప్రత్యేక పూజలు
తిరుమల వెంకన్నను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ప్రత్యేక పూజలు
తిరుమల


తిరుమల , 16 జూలై (హి.స.)తిరుపతి, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఈరోజు (గురువారం) తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భువనేశ్వరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను నారా భువనేశ్వరికి అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని శ్రీవారిని నారా భువనేశ్వరి ప్రార్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande