వైద్య సేవలు సద్వినియోగ పరచుకోవాలి.. సిద్దిపేట జిల్లా కలెక్టర్
వైద్య సేవలు సద్వినియోగ పరచుకోవాలి.. సిద్దిపేట జిల్లా కలెక్టర్
Collector


సిద్దిపేట, 16 జూలై (హి.స.)

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ

సెర్ప్, ఎస్ఆర్ డీఎస్ సిబ్బందికి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో జిల్లా మహిళా సమాఖ్య భవనంలో జిల్లా సెర్ప్, ఎస్ఆర్ డిఎస్ సిబ్బందికి ఎరిక్సన్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించి మాట్లాడారు. ఉదయం వాకింగ్ మంచి ఆరోగ్యం అలవాట్లు అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande