లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు
లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు
బండి సంజయ్


జగిత్యాల, 16 జూలై (హి.స.)

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, దేవస్థాన ప్రతినిధులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానిక బీజేపీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande