విశాఖ షిప్పింగ్ హార్బర్.బోటు.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏడుగురు మత్స్యకారులు
విశాఖ షిప్పింగ్ హార్బర్.బోటు.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏడుగురు మత్స్యకారులు
విశాఖ షిప్పింగ్ హార్బర్.బోటు.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏడుగురు మత్స్యకారులు

విశాఖపట్నం, 16 జూలై (హి.స.)

: ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇవాళ ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు హార్బర్ సమీపంలో అలల ఉద్ధృతికి అదుపుతప్పి మత్స్యకారులపై బోల్తాపడింది. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆ బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. మత్స్యకారులు బోటును పట్టుకొని ప్రాణాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాతారావు, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన గంగపుత్రులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంతో రూ.2.5లక్షల విలువ చేసే బోటు, రూ.2లక్షల విలువైన వల పూర్తిగా దెబ్బతిన్నాయి. గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande