
తిరుపతి, 16 జూలై (హి.స.): టీటీడీ సహకారంతో తిరుపతిలోని జూ పార్క్ను అభివృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyannapatrudu) వ్యాఖ్యానించారు. జూపార్క్ అభివృద్ధికి టీటీడీ సహకారం కోరుతామని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ వన్యప్రాణి - పర్యావరణ పరిరక్షణ అసెంబ్లీ కమిటీ ఈరోజు (గురువారం) తిరుపతిలోని ఎస్వీ జూపార్కును సందర్శించారు
జూపార్క్లో ఓ మెక్కను ఆ కమిటీ అధ్యక్షుడు, స్పీకర్ అయన్నపాత్రుడు నాటారు. అనంతరం సమీక్ష సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని జూపార్క్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే సందర్శకులు రావడం లేదని తెలిపారు. ఆసియాలోనే తిరుపతి జూపార్క్ అతిపెద్ద విస్తీర్ణం కలిగిన ప్రాంతమని వెల్లడించారు. జూపార్క్ అభివృద్ధిపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో మా అబ్బాయి రాజ్యసభ ఎంపీ అయ్యారని అయన్నపాత్రుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV