నెల్లూరు నగరాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం.. డిప్యూటీ మేయర్
నెల్లూరు నగరాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం.. డిప్యూటీ మేయర్
నెల్లూరు నగరాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం.. డిప్యూటీ మేయర్


నెల్లూరు, 16 జూలై (హి.స.) నెల్లూరు నగర కార్పోరేషన్ ను స్వచ్ఛతలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చినట్లు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ రోజు ఉదయం ప్రకటించారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి తరలించేందుకు ప్రవేశపెట్టిన ఈ వాహనాలలో మొదటి విడత కింద 100 ఎలక్ట్రికల్ ఆటోలను,ఈ శనివారం ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించనున్నారని వెల్లడించారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నెల్లూరు నగరం సర్వసిద్ధమైందని, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande