పీలేరులో రూ. 26 లక్షల ఎర్రచందనం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్!
పీలేరులో రూ. 26 లక్షల ఎర్రచందనం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్!
పీలేరులో రూ. 26 లక్షల ఎర్రచందనం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్!


పీలేరు, 16 జూలై (హి.స.)ఎర్రచందనం అక్రమంగా తరలింపుపై పోలీసుల నిషేదాజ్ఞలు ఉన్న కొందరు మాత్రం యదేచ్ఛగా దందా సాగిస్తున్నారు. టన్నుల కొద్ది దుంగలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సమయంలో దుంగల తరలింపును అడ్డుకుంటే అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలను సైతం తీస్తున్నారు. మరికొన్ని సమయాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో దొరికిపోయి జైలుపాలవుతున్నారు. తాజాగా పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. 1.061 టన్నుల 36 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఐదుగురు దుండగలును అరెస్ట్ చేశారు. పట్టుకున్న సరుకును స్థానిక పోలీసులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చట్ట విరుద్ధమైన పనులు ఎవరూ చేయొద్దని తెలిపారు. ఎర్రచందనం తరలింపుపై తమకు సమాచారం, అట్టి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు నిరంతరం పాటుపడుతున్నారు. స్మగ్లర్లు, కూలీలు, ట్రాన్స్పోర్ట్ చేసేవారిని అరెస్టు చేస్తున్నాము. అయినా కూడా జిల్లాలో అక్కడక్కడ స్మగ్లంగ్ జరుగుతూనే ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande