గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త
గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త
chandra babu


అమరావతి, 17 జూలై (హి.స.)

గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదోన్నతుల కల్పనకు సర్వీస్ రూల్స్ను సడలిస్తూ ప్రభుత్వం ఈరోజు(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 300 మందికి పైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సర్వీస్ రూల్స్ సడలించాలని గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. 2008 నుంచి ఈ అంశంపై వార్డెన్లు సర్కార్కు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు.

తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు ఉపశమనం లభించినట్లైంది. ఈ సందర్భంగా తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి సవితకు గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వార్డెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande