పంచదార పుణ్యక్షేత్రం (ఫణిగిరి) ఉనికి కి గ్రావెల్.తవ్వకాల.ముప్పు
పంచదార పుణ్యక్షేత్రం (ఫణిగిరి) ఉనికి కి గ్రావెల్.తవ్వకాల.ముప్పు
పంచదార పుణ్యక్షేత్రం (ఫణిగిరి) ఉనికి కి గ్రావెల్.తవ్వకాల.ముప్పు


రాంబిల్లి/అచ్యుతాపురం, , 17 జూలై (హి.స.)

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఫణిగిరిగా పేరుగాంచిన పంచదార్ల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించాయి. పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవల గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించారు. ఫణిగిరి పర్వతంపై నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచధారలు తమ ఉనికిని కోల్పోవలసి వస్తోంది. పంచదార్ల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం ఆ గోతుల్లో చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతోంది. రంగు కూడా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఏటా కార్తీక మాసంలోను, మహాశివరాత్రి పర్వదినాల్లోను పంచదార్ల పుణ్యక్షేత్రంలో ప్రవహించే ఐదు ధారలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఫణిగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ కొండపై గ్రావెల్ తవ్వకాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తంశారు. పాలకులు స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దరిమిలా పంచదార్ల గ్రామ పరిధిలోని సర్వే నంబరు1లోని 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలను శాఖాపరమైన సర్వే, వివరణాత్మక తనిఖీ పూర్తయ్యేంత వరకు తక్షణమే నిలిపివేయాలని అనకాపల్లి గనులు, భూగర్భ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande