వ్యాపారాలు ఇక మరింత వేగంగా.. ‘చౌకగా.. ’
భారత్-యూకే ఒప్పందంతో.. భారీగా సుంకాల తగ్గింపు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం యూకే ప్రతినిధుల వెల్లడి.
Sridhar babu


హైదరాబాద్, 17 జూలై (హి.స.)యునైటెడ్ కింగ్డమ్(యూకే) మధ్య ‘ఉచిత వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)’ బుధవారం అర్ధరాత్రి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. భారత్కు.. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని ప్రయోజనాలు చేకూరనున్నాయని, వ్యాపారాలు ఇక మరింత వేగంగా, చౌకగా విస్తరిస్తాయని సౌత్ ఏషియా(యూకే) డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రు అయ్యర్, సౌత్ ఇండియా(యూకే) ఇన్వార్డ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్ తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రు అయ్యర్, సిద్ధార్థ్ విశ్వనాథన్.. ఈ ఒప్పందం వల్ల కలగనున్న పలు లాభాలను వివరించారు.

ఈ ఒప్పందం లగ్జరీ కార్లు, స్కాచ్ విస్కీ వంటి హై-ఎండ్ మార్కెట్ కోసమే కాదు. టైర్-2 నగరాల్లోని రైతులు, చిన్న వ్యాపారుల ఉత్పత్తులు కూడా అంతర్జాతీయంగా పోటీ పడేలా స్థానిక భాషల్లో అవగాహన పత్రాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం. మొదటి రోజే భారత్ నుంచి రూ.1,500 కోట్లకుపైగా విలువైన కరాచీ బిస్కెట్లు, జ్యువెలరీ వంటి ఉత్పత్తులు యూకేకు ఎగుమతి అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande