గోల్కొండ కోటలో అమ్మకు తొలి బోనం
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు.
Bonalu


హైదరాబాద్, 17 జూలై (హి.స.)రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో శ్రీజగదాంబిక అమ్మవారికి కుమ్మరులు 11 బోనాలను సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు లంగర్హౌస్లో ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు... బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారి తొట్టెల, ఫలహారం బండికి పూజలు చేశారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రముఖులు కోటలో జగందాబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.11 లక్షల చెక్కును జగదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్కు మంత్రులు అందజేశారు.

కోటలో భక్తుల కోలాహలం

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande