యూనివర్సిటీల్లో. పోస్టుల దరఖాస్తుల్లో అనర్హులుగా వేలాది.మంది అభ్యర్ధులు
యూనివర్సిటీల్లో. పోస్టుల దరఖాస్తుల్లో అనర్హులుగా వేలాది.మంది అభ్యర్ధులు
యూనివర్సిటీల్లో. పోస్టుల దరఖాస్తుల్లో అనర్హులుగా వేలాది.మంది అభ్యర్ధులు


అమరావతి, 17 జూలై (హి.స.)

యూనివర్సిటీ పోస్టుల భర్తీలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా అభ్యర్థుల్లో అనర్హుల సంఖ్య భారీగా పెరిగింది. యూజీసీ పేస్కేలు ఉండాలనే నిబంధన అనర్హులను భారీగా పెంచింది. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని యూనివర్సిటీల్లో కలిపి 10,671 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 960 మంది (9.35 శాతం) మాత్రమే అర్హులుగా తేలారు. ఇక ప్రొఫెసర్ పోస్టులకు 1679 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో కేవలం 167 మంది (10.34 శాతం) అర్హులయ్యారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూజీసీ పేస్కేలుతో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఉండటంతో పాటు అన్ని సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఐఆర్లు సమర్పించాలనే నిబంధన పెట్టడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు అర్హత కోల్పోయారు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఐటీఐఆర్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు లేకపోయినా యూనివర్సిటీ ధ్రువీకరణతో దరఖాస్తులు తీసుకున్నాయి. కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 1,65,336 దరఖాస్తులు రాగా, 1,39,162 మంది (89.11 శాతం)ని అర్హులుగా గుర్తించారు. లెక్చరర్ పోస్టులకు 8005 మంది దరఖాస్తు చేసుకోగా 7214 (92.99 శాతం) మంది అర్హులుగా తేలారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande