ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్ల. పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్
ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్ల. పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్
ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్ల. పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్


అమరావతి, 17 జూలై (హి.స.)

ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు(శుక్రవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించారు. 2026-27లో FCV పొగాకు ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. గత నాలు ఎఫ్ రోజులుగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని... రోజుకు 8.5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు జరుగుతోందన్నారు.

ప్రస్తుతం గరిష్ఠ ధర రూ.250గా ఉందని.. ధర మరింత పెరిగేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని టొబాకో బోర్డుకు మంత్రి సూచించారు. కొనుగోళ్లు వేగవంతం కావడంతో రైతులకు మరింత మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. తక్కువ నాణ్యత గల పొగాకుకూ గిట్టుబాటు ధర లభించేలా కంపెనీలతో చర్చించాలని టొబాకో బోర్డు చైర్మన్, ఈడీకి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande