
హైదరాబాద్, 17 జూలై (హి.స.)దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పేదలు, బడుగు, బలహీనవర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భారాస సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, ఉద్యోగులు, విద్యార్థులు తదితర సమస్యలపై అర్జీలు రాగా మంత్రి నేరుగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్