
తిరుమల , 17 జూలై (హి.స.) కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల రద్ధీ భారీగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శించుకొవడానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో తిరుమల కొండపై భక్తుల కోలాహలం నెలకొంది. వీకెండ్ (వారాంతం) కావడం, సెలవు దినాలు దగ్గర పడుతుండటంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రోజు ఉదయం(శుక్రవారం) తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
కంపార్ట్మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లు దాదాపు గోగర్భం ప్రాజెక్టు వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. టైమ్ స్లాట్ (దర్శన టోకెన్లు) లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Sarvadarsanam) దాదాపు 30 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు సహనంతో వేచి ఉండి, అధికారులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV