అల్పపీడనం ఎఫెక్ట్..ఇవాళ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్..ఇవాళ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
rain


కర్నూలు, 17 జూలై (హి.స.)వాయువ్య బంగాళాఖాతంలోని స్పష్టమైన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి -మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డిలోని కొండాపూర్, కంది, సదాశివపేట, నిజామాబాద్ లోని పరిధిలోని సాలూర, కామారెడ్డి, నిజాంసాగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. ఇక ఇవాళ ఉదయం 9 తర్వాత అసిఫాబాద్ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అదిలాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande