సాంకేతిక విద్య శిక్షణ మండలి డిప్లొమా.కోర్సుల్లో కొత్త కరిక్యులం
సాంకేతిక విద్య శిక్షణ మండలి డిప్లొమా.కోర్సుల్లో కొత్త కరిక్యులం
సాంకేతిక విద్య శిక్షణ మండలి డిప్లొమా.కోర్సుల్లో కొత్త కరిక్యులం


అమరావతి, 26 జూలై (హి.స.)

సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్బీటీఈటీ) డిప్లొమా కోర్సుల్లో కొత్త కరిక్యులమ్ను ప్రవేశపెట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకొస్తోంది. కొత్త కరిక్యులమ్ను ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్గుప్తా మంగళగిరిలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సి-26 కరిక్యులమ్ రూపొందించామన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, పరిశ్రమల అవసరాలు, విద్యా ఫలితాలు, ఎన్బీఏ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని 50 మంది అకడమిక్ నిపుణులు, 108 మంది పరిశ్రమల నిపుణులు, 316 మంది సబ్జెక్టు నిపుణుల భాగస్వామ్యంతో దీనిని రూపొందించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande