
తాడేపల్లి :, 26 జూలై (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఉద్యోగులు ఆదివారం పాలాభిషేకం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్లో కృతజ్ఞత సభను ఏర్పాటుచేశారు. 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ఓపీఎస్ను పునరుద్ధరించి, తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్సీ అశోక్ కుమార్ ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ