(సవరించినది & పునర్విడుదల): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. వెంటిలేటర్పై చికిత్స
(సవరించినది & పునర్విడుదల): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. వెంటిలేటర్పై చికిత్స
మిత


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన క్షేమంగా ఉన్నారని హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయన మృతి చెందారంటూ వస్తున్న అసత్య ప్రచారాలను, వదంతులను అస్సలు నమ్మవద్దని వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వారు మరణించారంటూ పెద్ద పెద్ద చానల్లు కూడా పబ్లిష్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రి వైద్యులు స్పందించారు.

ఇవాళ (26 జూలై 2026, ఆదివారం) తెల్లవారుజామున హనుమకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే రోహిణి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ.. ప్రస్తుతం ఆయన హార్ట్ ఫంక్షనింగ్ నియంత్రణలో ఉందని, చికిత్సకు ఆయన శరీరం చక్కగా స్పందిస్తోందని వెల్లడించారు.

వైద్య పరీక్షల్లో ఆయనకు గుండెపోటుతో పాటు లంగ్స్ ఇన్‌ఫెక్షన్ (ఊపిరితిత్తుల సమస్య) ఉన్నట్లు కూడా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతానికి అత్యవసర చికిత్స అందించిన అనంతరం, మరింత మెరుగైన నిపుణుల వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన హైదరాబాద్ నుండి వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande