
వరంగల్, 26 జూలై (హి.స.)
వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గ మాజీ
ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు. హనుమకొండలోని ఆయన నివాసంలో ఉండగా.. ఉదయం ఒక్కసారిగా హాట్ స్ట్రోక్కు గురయ్యారు. కుటుంబీకులు ఆయనను వెంటనే వరంగల్లోని రోహిణీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చేజారీ పోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. సుదర్శన్రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హుటాహుటిన వరంగల్లోని ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.
ఇక, ఉద్యమ నాయకుడిగా పేరుగాంచిన పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్లో చురుగ్గా పని చేశారు. 2004 డిసెంబర్లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్గా, తదనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ వెంటే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. తిరిగి.. 2018 ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018లోనే తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ (Civil Supplies Corporation) ఛైర్మన్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..