రామసముద్రంలో ఘనంగా ఏకలవ్య జయంతి.. ప్రజలకు అన్నదానం!
రామసముద్రంలో ఏరుకుల కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఘనంగా జరిగింది.
ekalavya-jayanthi-celebrated-in-ramasamudram-annadhanam-held-167


రామసముద్రం, 26 జూలై (హి.స.)రామసముద్రంలో ఏరుకుల కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఘనంగా జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి, అన్నదానం నిర్వహించారు.

, ఏకలవ్య జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా ఏరుకుల కమ్యూనిటీ అధ్యక్షుడు ఎం. రామకృష్ణ ఆధ్వర్యంలో రామసముద్రం మండలం చెక్పోస్ట్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏకలవ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎం. రామకృష్ణ మాట్లాడుతూ, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ఏకలవ్య ఆదర్శప్రాయుడని అన్నారు. గురుభక్తి, క్రమశిక్షణ, పట్టుదల, త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఏకలవ్య జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా చేసుకుని అభివృద్ధి సాధించాలని, ఏకలవ్య చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏరుకుల కమ్యూనిటీ నాయకులు, యువకులు, సామాజిక కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏకలవ్యకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం భక్తులకు, ప్రజలకు అన్నదానం నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande