నల్గొండ చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఘోర అగ్నిప్రమాదం: 17 దుకాణాలు పూర్తిగా దహనం, తప్పిన ప్రాణనష్టం!
నల్గొండ చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఘోర అగ్నిప్రమాదం: 17 దుకాణాలు పూర్తిగా దహనం, తప్పిన ప్రాణనష్టం!
fire


నార్కట్‌పల్లి, 26 జూలై (హి.స.)

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో గుట్ట కింద ఉన్న దాదాపు 17 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande