
అనకాపల్లి, 27 జూలై (హి.స.)
అనకాపల్లి మండలంలోని మూలపేట వద్ద శారదా నది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేటజంగాలపాలెం గ్రామానికి చెందిన నలుగురు సోమవారం నదిలో ఇసుకను ట్రాక్టర్లో నింపి తరలిస్తుండగా.. సంపతిపురం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బండి ముసలి నాయుడు(60), మంగ(40) మృతి చెందారు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ