
అమరావతి, 27 జూలై (హి.స.)
కంకిపాడు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పునాదిపాడులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ పునాదిపాడులో రూ.1.5 కోట్లతో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అంతకుముందు ఇడుపుగల్లు నుంచి పునాదిపాడు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. పునాదిపాడుకు చేరుకున్న మంత్రి లోకేశ్కు తెదేపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేశ్.. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ప్రవాసాంధ్రుడు, గ్రామానికి చెందిన పోలవరపు మాధవరావు అందజేసిన రూ.1.5 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ