
దేవీపట్నం:, 27 జూలై (హి.స.)
పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం సమీపంలో ఇద్దరు గల్లంతయ్యారు. నదిలో ముగినిపోయిన జేసీబీని బయటకు లాగేందుకు తాడు వేస్తుండగా ఇద్దరు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిలో ఒకరు ఇంజినీర్ కాగా.. మరొకరు మిషన్ ఆపరేటర్. వారిలో ఇంజినీర్ మృతదేహం లభ్యం కాగా ఏలూరు జిల్లా పోలవరం ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన ఆపరేటర్ కోసం మత్స్యకారులు వలలతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ