
ఆత్మకూరు, 27 జూలై (హి.స.)
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం తెల్లపాడు, ముస్తాపురం గ్రామాల్లో రూ.34 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, సీసీ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి తగినట్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ