విద్యార్థులపై దాడికి కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలి: చామల
విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి కేంద్ర హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Chamala kiran reddy


హైదరాబాద్, 27 జూలై (హి.స.)విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి కేంద్ర హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అంతా అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపు కుంటే ఉపేక్షించేది లేదు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే ప్రభుత్వం భాధ్యతతో వ్యవహరించాలి. సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో జెన్జీకి చట్టసభల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్లో కూడా 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న యువతకు చట్టసభలో ప్రాతినిద్యం కల్పిస్తే.. వారి సమస్యలపై పూర్తి అవగాహనతో చర్చించి, సమస్యలు పరిష్కారం చేయవచ్చు. ఈ ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని ఇండియా కూటమి నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి వివరించనున్నారు’ అని చామల తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande