150 ఏళ్ల నాటి కరువు పరిస్థితి
ప్రపంచంపై ప్రకృతి చాలా తీవ్రంగా దాడి చేసిందని, 150 సంవత్సరాల్లో లేని కరువు పరిస్థితి కనిపిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Nageshwar rao


హైదరాబాద్, 27 జూలై (హి.స.)ప్రపంచంపై ప్రకృతి చాలా తీవ్రంగా దాడి చేసిందని, 150 సంవత్సరాల్లో లేని కరువు పరిస్థితి కనిపిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరరైన ఆయన మాట్లాడారు. పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో మనదేశానికి వచ్చే నైరుతి రుతుపవనాల జాడ లేకుండా పోయిందని, దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. దీంతో రానున్న మార్చి, ఏప్రిల్ నెలల దాకా దుర్భిక్ష ప్రభావం ఉండవచ్చునన్నారు. తెలంగాణలో సరైన వర్షాలు కురవవని ఐఎండీ, ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వచ్చే నెలలో అంతంత మాత్రంగా కురిసే వర్షాలు మెట్ట పంటలకు ఉపయోగపడవచ్చునన్నారు. వరి సాగుకు చాలా కష్టతరంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ కాలంలో తక్కువ సాగునీటితో చేతికొచ్చే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలను సాగుచేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. కాగా, రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత సమర్థంగా, పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు నాణ్యమైన ేసవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు చేపట్టాలని ఒక ప్రకటలో సూచించారు. మార్కెట్ కమిటీల పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఆరు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు వారం రోజులపాటు తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు.

27 నుంచి రైతు వేదికల్లో విత్తన మేళా

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్డర్ డాక్టర్ గోపి తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగుకు అనువైన ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande