డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు.
యువకుడు డ్రగ్స్ మత్తులో పోలీసుల పైకి కారు ఎక్కించాడు. నగరంలోని అబిడ్స్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి
Drugs


హైదరాబాద్, 27 జూలై (హి.స.) ఓ యువకుడు డ్రగ్స్ మత్తులో పోలీసుల పైకి కారు ఎక్కించాడు. నగరంలోని అబిడ్స్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్, సీఐ గాయపడ్డారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో హెచ్న్యూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అబిడ్స్ వద్ద కారులో ఉన్న సైఫ్ అనే వ్యక్తికి డ్రగ్స్ ప్యాకెట్ను మరో వ్యక్తి ఇచ్చాడు. ప్యాకెట్ అందించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న సైఫ్ను కిందికి దిగాలని పోలీసులు సూచించారు. దీంతో అతడు కారు దిగకుండా పోలీసులపైకి వాహనాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్కు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. కారును అడ్డుకునే క్రమంలో సీఐ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అఫ్జల్గంజ్ వద్ద నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande