హైడ్రాపై వివాదాలు.. కబ్జాదారుల సృష్టే
హైడ్రా చట్టబద్ధమైన సంస్థ అని, చట్ట ప్రకారం నడుచుకుంటుందని సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
Ranganadh


హైదరాబాద్, 27 జూలై (హి.స.)హైడ్రా చట్టబద్ధమైన సంస్థ అని, చట్ట ప్రకారం నడుచుకుంటుందని సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను చెరబడుతున్న కొందరు రియల్టర్లు, కబ్జాదారులు పనిగట్టుకొని హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భారత పౌరుడిగా, బాధ్యతాయుత అధికారిగా తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో ఉపేక్షించడం ఉండదని స్పష్టం చేశారు. హైడ్రా ప్రస్థానం, చేపట్టిన చర్యలు, వస్తున్న ఆరోపణలు, వివాదాలపై రంగనాథ్ ప్రత్యేక మాట్లాడారు.

స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. అవతలి వ్యక్తులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని కోర్టులు స్పందిస్తున్నాయి. మా వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డులనూ కోర్టు ముందుంచుతాం. భారతీయుడిగా, బాధ్యతాయుతమైన అధికారిగా న్యాయస్థానాలను గౌరవిస్తాం. సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువుల కేసుల విషయంలో వర్చువల్గా రెండు పర్యాయాలు విచారణలో పాల్గొన్నాను.

హైడ్రా సర్కారుకు వరమా? శాపమా?

హైడ్రా చట్టబద్ధంగా పని చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 38ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సంస్థకు వేలాది మంది మద్దతు తెలుపుతున్నారు. స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైడ్రా ప్రభుత్వానికి వరమా, శాపమా అన్నది దీంతో తెలిసిపోతుంది. కబ్జాదారులు తప్ప.. ఇతరులు హైడ్రా తీరును అభినందిస్తున్నారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏం చేస్తున్నారు?

హైడ్రా ఏర్పడిన తరువాతే చాలా మందికి అధికారిక లే అవుట్, అనుమతి లే అవుట్ అన్నదానిపై అవగాహన వచ్చింది. గతంలో తక్కువ ధరకు వస్తుందని అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్లు కొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. లే అవుట్లో ప్లాట్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు ముందుగా ఆ ప్రాజెక్టులకు అనుమతి ఉందేమో చూసుకోవాలి. ఆ ప్రాంతం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉందా? అన్నది హెచ్ఎండీఏ వెబ్సైట్లో పరిశీలించాలి. ప్రభుత్వ, పార్కు స్థలమా? అన్నది భూభారతిలో తెలుసుకోవాలి. త్వరలో హైడ్రా రక్ష పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. దేశంలోనే హైడ్రా మొదటి మోడల్. ఇతర రాష్ర్టాల్లోనూ హైడ్రా ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఇది సంస్థ సాధించిన విజయం.

హైడ్రాపై వివాదాలకు కారణమేంటి?

కొందరు రియల్టర్లు, కబ్జాదారుల ప్రత్యేక మోడస్ ఆపరెండీ ఇందుకు కారణం. ప్రభుత్వ ఆస్తులను చెరబట్టి తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికంగా వారిది తాత్కాలికంగా పైచేయి అవుతోంది. ఓ ప్రాంతం సర్వే నెంబర్లను మరో ప్రాంతంలో చూపుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వివిధ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భూమి ఉంటుంది. దీనిని బీ-2 క్యాటగిరీ భూములుగా పరిగణిస్తారు. కంటోన్మెంట్లో ఈ తరహా భూమి 119 ఎకరాలు ఉంది. లోతుకుంటోని సర్వే నెంబర్ 1, 2లో ఈ భూమి ఉన్నట్టుగా చూపుతూ పలు నిర్మాణ సంస్థలు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి. మైనింగ్, అటవీ శాఖ అనుమతులు లేకుండా 2500 ఏళ్ల చరిత్ర ఉన్న గుట్టలను బ్లాస్టింగ్ చేస్తున్నారు. చెట్లు తొలగిస్తున్నారు. దీంతో అక్కడి వన్యప్రాణుల మనుగడ కష్టంగా మారింది. ది సేవ్ రాక్ సొసైటీ, పర్యావరణవేత్తల ఫిర్యాదు మేరకు ఆభూమికి ఫెన్సింగ్ వేశాం. డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ (డీఈవో) వద్ద ఉన్న వివరాల ప్రకారం జీఎల్ఆర్ 243 మ్యాప్ పరిశీలించాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం హైడ్రా ఫెన్సింగ్ వేసిన భూమికి లోతుకుంట సర్వే నెంబర్ 1, 2 ఉన్న ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. తప్పుడు పద్ధతుల్లో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. వీటిపై మేం కూడా కౌంటర్ దాఖలు చేస్తున్నాం. గోల్కొండ పేరు చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని చార్మినార్ నాది అంటే ఎలా? కోర్టు కంటెంప్ట్లపై ఆధారాలతో సహా అప్పీల్కు వెళతాం అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande