కేసీఆర్.. సింగరేణికి తీరని ద్రోహం చేశారు: కిషన్ రెడ్డి
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Kishan reddy


హైదరాబాద్, 27 జూలై (హి.స.)దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఎన్టీపీసీ(NTPC) కి బొగ్గు సరఫరా అవుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి తీవ్ర నష్ట చేకూర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి మెరుగుపడటం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం 49 శాతం, తెలంగాణ ప్రభుత్వం 51 శాతం వాటాతో సింగరేణి కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్.. సింగరేణికి తీరని ద్రోహం చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఆదాయానికి గత ప్రభుత్వం గండికొట్టిందని ఆరోపించారు. రాజకీయ వేదికలకు సింగరేణిని వాడుకున్నారంటూ బీఆర్ఎస్, కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande