
హైదరాబాద్, 27 జూలై (హి.స)
గుండెపోటుతో యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ రెడ్డి తదితరులు కూడా పరామర్శించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకొని, అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు