నగరంలో భారీ వర్ష హెచ్చరికలు.. ఐటీ సంస్థలకు పోలీసుల కీలక సూచన
నగరంలో భారీ వర్ష హెచ్చరికలు.. ఐటీ సంస్థలకు పోలీసుల కీలక సూచన
Police


హైదరాబాద్, 27 జూలై (హి.స.)

ఈ రోజు హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయినా సైబరాబాద్ పోలీసులు ఐటీ సంస్థలకు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలను నివారించడంతో పాటు అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కంపెనీలు తమ ఉద్యోగులను విడతల వారీగా ముందస్తుగా (లాగ్-అవుట్) ఇంటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ముందస్తు లాగ్-అవుట్ నిర్ణయం వల్ల సాయంత్రం వేళల్లో ఒకేసారి రోడ్లపైకి వాహనాలు రాకుండా చూసి, ట్రాఫిక్ స్తంభించకుండా అరికట్టవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు.

కాగా, ఐటీ కంపెనీలు తమ కార్యాలయాల వివరాలు, ముందస్తు లాగ్-అవుట్ సమయాలు, పంపించే ఉద్యోగుల సమాచారాన్ని సమన్వయం కోసం trfcord@scsc.in అనే ఈమెయిల్ ఐడీకి పంపించాలని సైబరాబాద్ సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ (SCSC), పోలీసులు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున, రవాణా ఇబ్బందులు కలగకుండా ఐటీ సంస్థలు పోలీసుల హెచ్చరికలను పాటించి ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande