ఏఐసీసీ కీలక భేటీకి ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్; పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలపై చర్చ

హైదరాబాద్, 27 జూలై (హి.స.)

న్యూఢిల్లీలో నేడు జరగబోయే అత్యంత కీలకమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు అత్యవసరంగా వెళ్లిన ఆయన, పార్టీ జాతీయ అగ్రనేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన వివిధ ప్రజా సంక్షేమ పథకాల పురోగతి, రుణమాఫీ అమలు తీరు, మరియు ప్రజల్లో ప్రభుత్వ ఇమేజ్ ఎలా ఉందనే అంశాలపై ఆయన హైకమాండ్‌కు సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో త్వరలోనే చేపట్టబోయే పార్టీ సంస్థాగత మార్పులు, ఖాళీగా ఉన్న వివిధ జిల్లాల అధ్యక్షుల నియామకాలు, మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

`

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande