
హైదరాబాద్, 27 జూలై (హి.స.)
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 15 (P15) ఫౌండేషన్ పనులను వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ జలమండలి (HMWS&SB) అత్యవసర పైప్‌లైన్ జంక్షన్ పనులను చేపట్టింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2 కు చెందిన 1,600 మి.మీ వ్యాసం కలిగిన భారీ ప్రధాన పైప్‌లైన్ బదిలీ మరియు అనుసంధాన పనుల నిమిత్తం ఈరోజు (జూలై 27, సోమవారం) ఉదయం 10:00 గంటల నుండి రేపు (జూలై 28, మంగళవారం) ఉదయం 10:00 గంటల వరకు (24 గంటల పాటు) నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలలో మంచినీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పనుల కారణంగా ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, రామంతాపూర్, దిల్‍సుఖ్‍నగర్, ఎల్‌బీనగర్, పద్మారావు నగర్, ఫతేనగర్, హస్మత్‌పేట్, మరియు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పలు డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోయింది. రేపు ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ పనులు ముగిసిన తర్వాత విడతల వారీగా నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని, అప్పటివరకు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మరియు అత్యవసర అవసరాల కోసం జలమండలి ఉచిత వాటర్ ట్యాంకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi