ఆకివీడు రామాలయం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆకివీడు రామాలయం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
akividu


ఆకివీడు, 27 జూలై (హి.స.)

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి ఉన్న అన్ని ప్రధాన లీగల్ అడ్డంకులను తొలగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రభుత్వ స్థలంలో ఆలయాన్ని నిర్మించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసిన కోర్టు, ఆలయ నిర్మాణానికి గతంలో స్థానిక జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం (NOC) చట్టబద్ధమైనదేనని స్పష్టం చేసింది. నిబంధనలకు లోబడే కలెక్టర్ ఈ అనుమతులు ఇచ్చారని, ఇందులో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టుపై ఎవరికైనా బలమైన, చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే వారు భవిష్యత్తులో కొత్త పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆకివీడు రాముడు సుప్రీంకోర్టులో గెలిచాడని, సత్యం మరియు ధర్మం వర్ధిల్లాయని సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. ఈ తీర్పుతో ఆకివీడులో ఆలయ పనులు వేగవంతం కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande